‘ఆమె స్టార్‌లా కాదు ఓ రోగిలా ప్రవర్తించాలి’

22 Mar, 2020 08:25 IST|Sakshi

లక్నో : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనికా కపూర్‌ ఓ స్టార్‌లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని ఆమెకు చికిత్స అందచేస్తున్న లక్నో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్‌ సింగర్‌కు ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని, ఆమె ఓ స్టార్‌లా వ్యవహరించకుండా రోగిలా సహకరించాలని సంజయ్‌గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పీజీఐఎంఎస్‌)  డైరెక్టర్‌ ఆర్‌కే ధిమన్‌ పేర్కొన్నారు. కనిక కపూర్‌ తన భద్రత కోసం ఆస్పత్రితో సహకరించాలని అన్నారు. (జనతా కర్ఫ్యూ: 14 గంటల్లో ఏం జరగబోతుంది?)

ఆమెకు కోవిడ్‌-19 యూనిట్‌లో ఏసీ, టెలివిజన్‌ సహా అన్ని సదుపాయాలూ కల్పించామని ఆమె ముందు స్టార్‌లా కాకుండా రోగిలా మసులుకోవాలని హితవు పలికారు. దేశంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తొలి బాలీవుడ్‌ సెలెబ్రిటి కనికా కపూర్‌ కావడం  గమనార్హం. తాను కరోనా వైరస్‌ బారిన పడినట్టు కనికా కపూర్‌ వెల్లడించిన వెంటనే బీజేపీ ఎంపీ, మాజీ రాజస్ధాన్‌ సీఎం వసుంధర రాజే కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సింగ్‌ లక్నోలో ఓ పార్టీలో కనికా కపూర్‌ను కలిశారు. చదవండి : కనికా కపూర్‌కు కరోనా

మరిన్ని వార్తలు