‘ప్రత్యేక జెండా ఉండకూడదన్న నిబంధన లేదు’

8 Mar, 2018 14:14 IST|Sakshi
ప్రత్యేక జెండా ఆవిష్కరించిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక, బెంగళూర్‌ : కర్ణాటకలోని సిద్ధ రామయ్య నేతృత్వంలోని  ప్రభుత్వం అన్నంత పని చేసింది. రాష్ట్రం కోసం కొత్త జెండాను రూపకల్పన చేసిన అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. నేడు దానిని ఆవిష్కరించింది. గురువారం ఉదయం విధాన సౌధాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండాను ఆవిష్కరించారు.

ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న నాడా ద్వజ(జెండా) రాష్ట్ర చిహ్నం గంఢ బెరుండను, రెండు తలల పక్షిని కలిగి ఉంది. ప్రత్యేక జెండాకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయగా..  ఆవిష్కరణానంతరం ఏర్పాటు చేసిన కమిటీని సిద్ధరామయ్య అభినందించారు. ఈ జెండాను కేంద్రం ఆమోదం కోసం పంపనున్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూదన్న నిబంధన  రాజ్యాంగంలో పొందుపరచలేదు. అలాంటప్పుడు కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉంటే తప్పేం కాదు’ అని ఈ సందర్భంగా సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు.

అప్పట్లో ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకత ప్రదర్శించగా.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల‍్లువెత్తింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర జెండాకు ఆమోదం లభించటం అనుమానమే. అయితే త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు