వైరలవుతోన్న బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్‌ వీడియో

24 Jul, 2019 13:12 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సుమారు14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంతోషంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో తెగ వైరలవుతోంది. రేణాకాచార్య కర్ణాటక దేవంగరే జిల్లా హోన్నాళి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

స్పీకర్‌ సూచన మేరకు మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్‌ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది.

మరిన్ని వార్తలు