అధికారిపై ముఖ్యమంత్రి చెంపదెబ్బ

17 Jan, 2016 09:32 IST|Sakshi
అధికారిపై ముఖ్యమంత్రి చెంపదెబ్బ

సాక్షి, బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ వైరస్‌లా సామాజిక మాధ్యమాల్లో, ఇతర టెలివిజన్ చానళ్లలో ప్రసారమైంది. దీంతో తాను కమిషనర్‌పై చేయి చేసుకోలేదని.. కేవలం ముందుకు తోశానని సిద్ధరామయ్య కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి... బళ్లారిలో నూతనంగా నిర్మించిన వాల్మీకి భవనం ప్రారంభోత్సవంలో శనివారం సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ రమేశ్‌పై చెంపపై చేయి చేసుకున్నారు. ప్రజల మధ్య బహిరంగంగా ఈ ఘటన జరగటంతో మొత్తం వ్యవహారం రచ్చకెక్కింది.

వీడియో క్లిప్పింగ్ వెల్లడవ్వడంతో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను కమిషనర్‌పై చేయి చేసుకోలేదని.. కేవలం ముందుకు తోశానని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు