-

కాంగ్రెస్‌ కార్యక్రమానికి అనుమతినివ్వని ప్రభుత్వం!

10 Jun, 2020 17:59 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ చేయాలనుకున్న ఒక కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినివ్వలేదు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం డీకే శివ కుమార్‌ను ఎంపిక  చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్నికార్యకర్తల నడుమ  నిర్వహించుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా కరోనా కారణంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని తెలిపింది. దీని గురించి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ, ‘రెండు నెలల క్రితమే మేం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. అనుమతి కోరుతూ ఇప్పటి వరకు మూడు సార్లు అభ్యర్థించాను. మొదట మే 31న అనుకోగా, తరువాత జూన్‌ 7, జూన్‌14 తేదీలకు కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. అయినప్పటికి కరోనా కారణంగా అనుమతినివ్వలేమని ప్రభుత్వం తెలిపింది. ఇది రాజకీయం చేయడం కాక మరేమిటి? బీజేపీ ర్యాలీలు చేయడానికి ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వారి పార్టీ వారు ఇలా చెయ్యొచా? వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ కార్యక్రమాలు చేపట్టింది. విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను ప్రభుత్వం తప్పుగా ఉపయోగిస్తోంది. మేం రాజకీయ నాయకులం, ఇలాంటి కార్యక్రమాలను నాలుగు గోడల మధ్య చేయాలేం’ అని శివకుమార్‌ పేర్కొన్నారు. 

(రెండో పెళ్లికి సిద్ధ‌మైన సీఎం కుమార్తె)

దీనిపై కాంగ్రెస్‌, నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,  ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలను తమ పార్టీ ఖండిస్తుందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. జూన్‌ 14 న నిర్వహించాలనుకున్న ప్రతిజ్ఞ దినానికి అనుమతినివ్వకపోవడం శోచనీయమని పేర్కొంది. కర్ణాటక వ్యాపంగా 7,800 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని 10 లక్షల కార్యకర్తల నడుమ సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. కర్ణాటకలో 2019లో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన సంగతి తెలిసిందే. (కోవిడ్‌-19 : భారీగా మెరుగుపడిన రికవరీ రేటు)

మరిన్ని వార్తలు