పెద్ద ఎత్తున నగదు, డ్రగ్స్‌ పట్టివేత

18 Apr, 2018 15:31 IST|Sakshi
నగదు, డ్రగ్స్‌ పట్టివేత

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న తరుణంలో  పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో భారీ  నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం, మాదకద్రవ్యాలు  పట్టుబడటం కలకలం రేపుతోంది. వివిధ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున‍్న వాటిని పరిశీలిస్తే .. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి ఏవిధంగా వుందో అర్థమవుతుంది.  కర్ణాటక విజయంపై  కన్నేసిన పార్టీలు  ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరికి వారే వ్యూహచరనలో మునిగితేలుతున్నారు.

దీనిలో భాగంగా పెద్ద ఎత్తున్న నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పంచిపెడుతున్నారు. తాజాగా రూ. 31.55 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా  4.58 కోట్ల రూపాయల విలువైన 1.15 లక్షల లీటర్ల మద్యాన్ని, 30.52 కిలోల నార్కోటిక్‌ డ్రగ్స్‌ను వివిధ ఏజెన్సీలు సీజ్‌ చేశాయి. ఈ డ్రగ్స్‌ విలువ సుమారు రూ.19.79 లక్షలుగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు 3.59 కోట్ల రూపాయల విలువైన 14.492 కిలోల బంగారాన్ని, 12.67 లక్షల రూపాయల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు