కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..!

1 Dec, 2019 13:02 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ రైతు తన తోటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నాడు. సంగతేంటంటే.. ఆ రైతు కష్టించి పండించిన పంటను కోతులు గత కొంతకాలంగా నాశనం చేస్తున్నాయి. అనేక విధాలుగా ఆలోచించిన ఆ రైతుకు తట్టిన ఓ వినూత్న ఆలోచన మంచి ఫలితాన్నిచ్చింది. ఆ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కను పులిలా తయారుచేశాడు. ఆ రైతు ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని నాలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ గౌడ పంటను కోతులు గత కొంతకాలంగా నాశనం చేస్తుండేవి. దీంతో నాలుగేళ్ల కిందట ఓ పులి బొమ్మను తోటలో పెట్టాడు.

 

చదవండి: వైరల్‌ : ఫైన్‌ వేశారని నానా రభస చేశాడు

అప్పటి నుంచి కోతులు అటువైపు రావడం దాదాపు తగ్గిపోయాయి. దీంతో ఆశ్చర్యపోయిన శ్రీకాంత్‌ మరో తోటలో కూడా పులిబొమ్మను ఏర్పాటు చేశాడు. అది మంచి ఫలితం ఇవ్వడంతో తన కుక్కనే పులిగా మార్చేశాడు. ఆ కుక్క తోటలో తిరుగుతుంటే కోతులు తోట వైపు రావడం మానేశాయి. అలా శ్రీకాంత్‌ గౌడ తన తోటను కాపాడుకుంటున్నాడు. కెమికల్ రంగులు వేయడం వల్ల కుక్క చర్మం పాడవుతుందని హెయిర్‌ డై వేస్తూ.. దాని ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇది చూసిన గ్రామంలోని ఇతర రైతులు కూడా శ్రీకాంత్ గౌడలా కుక్కలకు రంగులు వేయాలని భావిస్తున్నారట. కాగా.. పులిలా డిజైన్ చేసిన ఈ కుక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు