మాస్కులు ధరించని వారి నుంచి 3 లక్షల 43 వేలు వసూలు

22 May, 2020 15:32 IST|Sakshi

బెంగళూరు : కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. కొన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి .ఈ క‍్రమంలో మాస్కు ధరించకుండా బయటికి వచ్చిన వారిపై కర్ణాటక ప్రభుత్వం రూ. 200 జరిమాన విధించింది. ఈ జరిమానా ద్వారా ఇప్పటి వరకు 15 వేల మంది నుంచి మూడు లక్షల 43 వేలు వసూలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సైతం మాస్కు ధరించకుండా బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై రూ. 1000 ఫైన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (కోవిడ్‌: ఆ కాంబినేషన్‌తో అద్భుత ఫలితాలు!)

‘మే 5 నుంచి ముఖానికి మాస్కులు ధరించకుండా బయటికి వచ్చిన 1715 మంది నుంచి రూ. 3,43,000 వేలను ప్రభుత్వం వసూలు చేసింది’ అని బెంగుళూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే జోన్ల వారిగా ఎంతమంది నుంచి ఎన్ని డబ్బులు వసూలు అయ్యాయనే విషయాన్ని చార్ట్‌ ద్వారా విడుదల చేసింది. కాగా కర్ణాటకలో ప్రతిరోజు 10 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ తెలిపారు.గురువారం రోజు 11,449 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కర్ణాటకలో 1605 మంది కరోనా బారిన పడగా, 571 మంది మృతిచెందారు. వైరస్‌నుంచి కోలుకొని 41 మంది డిశ్చార్జి అయ్యారు. (విమాన సర్వీసులు అప్పుడే వద్దు)

ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. !

మరిన్ని వార్తలు