'జల్లికట్టుపై తీర్పొచ్చాకే కంబాలా తేలుస్తాం'

30 Jan, 2017 17:57 IST|Sakshi

బెంగళూరు: జల్లికట్టు తరహాలో కర్ణాటకలోని  సంప్రదాయ క్రీడ కంబాలపై నిషేధం ఎత్తివేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో జల్లికట్టుపై మంగళవారం తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో ఆ తీర్పు తర్వాతే కంబాలాపై నిషేధం విధించాలా వద్దా అనే విషయాన్ని కర్ణాటక కోర్టు నిర్ణయించనుంది.

జల్లికట్టు మాదిరిగా కర్ణాటకలో 'కంబాలా' పేరిట బఫెలో రేస్‌ జరుగుతుంటుంది. అయితే, జంతుప్రేమికులు కోర్టుకు వెళ్లడంతో జల్లికట్టుమాదిరిగానే నవంబర్‌ 2016లో హైకోర్టు దీనిపై స్టే విధించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా కంబాలా క్రీడ కొనసాగేందుకు అణువుగా చట్టంలో సవరణలు చేయాలని జనవరి 24న తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి  6న దీనికి సవరణలు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు