ఆస్తులెంతో చెప్పమంతే!

27 Mar, 2019 14:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆస్తి వివరాల్ని వెల్లడించని 45 మంది ఐపీఎస్‌లు  

సాక్షి, బెంగళూరు : చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన ఐపీఎస్‌ అధికారులు తమవరకూ వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. కర్ణాటకలో 45 ఐపీఎస్‌ అధికారులు ఆస్తి వివరాలు వెల్లడించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2018 ఆఖరు నుంచి ఈ ఏడాది జనవరి ఆఖరిలోగా ఐపీఎస్‌ అధికారులు తమ తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఇంతవరకు 45 మంది ఐపీఎస్‌ అధికారులు వాటిని సమర్పించలేదు. వీరిలో ఎస్పీల నుంచి అదనపు డీజీపీ స్థాయివరకూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు నిర్లక్ష ధోరణి అవలంబిస్తుండటంపై రాష్ట్ర హోంశాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ.. డీజీపీ నీలమణిరాజుకు లేఖ రాశారు. ప్రతి ఏడాది ఐపీఎస్‌ అధికారులు తమ, తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు తెలియజేయాలనే నిబంధన ఉంది. ఈ సమాచారాన్ని నమోదు చేయడానికి ఆన్‌లైన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అధికారులు అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్థిర, చరాస్తుల వివరాలు అందించడానికి ఐపీఎస్‌లు వెనుకంజ వేస్తున్నారని, దీనిపై డీజీపీ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.

మరిన్ని వార్తలు