కర్ణాటకలో కరోనా కలకలం.. అతడి కోసం గాలింపు

9 Mar, 2020 19:08 IST|Sakshi

మంగళూరు : కర్ణాటకను కరోనా వైరస్‌ భయం వెంటాడుతోంది. విదేశాల నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తి హాస్పిటల్‌లో చేరకుండా తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై భయాందోళనల నేపథ్యంలో భారత్‌లోని ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చేవారకి స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం దుబాయ్‌ నుంచి మంగళూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని మంగళూరు జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అక్కడ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అయితే అతను మాత్రం కనిపించకుండా పోయాడు. దీంతో అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 

ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రస్తుతం అతడు హాస్పిటల్‌లో చేరలేదని తెలిపింది. వైద్య సూచనను అతిక్రమించి అతను ఎక్కడికో వెళ్లిపోయినట్టు చెప్పింది. ‘ప్రయాణికుడు కనిపించకుండా పోవడంపై పోలీసులకు సమాచాం అందింది. ఓ బృందం అతని ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేసింది. త్వరలోనే అతన్ని పట్టుకుని హాస్పిటల్‌లో చేర్పిస్తాం’ అని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గత రాత్రి నుంచి పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సదరు వ్యక్తి హాస్పిటల్‌ చేరిన తర్వాత సిబ్బందితో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 3 వేల మందికి పైగా మరణించారు. భారత్‌లో ఇప్పటివరకు 43 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

చదవండి : కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు

కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!

మరిన్ని వార్తలు