ప్రియుడిని కట్టేసి.. చెప్పుతో కొడుతూ

21 Aug, 2019 18:34 IST|Sakshi

బెంగళూరు : టిక్‌టాక్‌ వీడియోలు రూపొందించాడనే కారణంతో ప్రియురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై దాడి చేశారు. చెట్టుకు కట్టేసి అతడిని చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... హలిగెర గ్రామానికి చెందిన బుగ్గప్ప(19) అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో కలిసి పలు టిక్‌టాక్‌ వీడియోలు చేశాడు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు.

ఈ క్రమంలో వాటిని చూసిన బాలిక కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బుగ్గప్పను తీవ్రంగా కొడుతూ ఈడ్చుకెళ్లారు. అతడిని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. వీరితో పాటు బాలిక కూడా బుగ్గప్పపై దాడి చేసింది. అతడిని చెప్పుతో కొడుతూ దూషించింది. తనకు బుగ్గప్పతో సంబంధం లేదని.. అతడు వీడియోలు చేసిన విషయం తనకు తెలియదని అక్కడున్న వారితో చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న బుగ్గప్ప తల్లి కొడుకు దగ్గరికి పరిగెత్తుకువచ్చింది. అతడిని కొట్టవద్దంటూ ఎంతగా బతిమిలాడినా బాలిక కుటుంబ సభ్యులు కనికరించలేదు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన బుగ్గప్పను సమీప ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం గమనార్హం. కాగా వెనుబడిన జిల్లా అయిన యాదగిరిలోని గ్రామాల్లో సోషల్‌ మీడియా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు