హెల్మెట్‌కు ఏసీ !

16 Sep, 2019 07:50 IST|Sakshi
ధరించిన ఏసీ హైల్మెట్‌, సందీప్‌ దహియా

కర్ణాటక, యశవంతపుర : వేసవిలో మండే ఎండలకు హెల్మెట్‌ ధరించటమంటే తలకు మించిన భారంగా భావిస్తారు. అయితే సమస్యను పరిష్కారించటానికి బెంగళూరుకు చెందిన మెకానికల్‌ ఇంజనీర్‌ హెల్మెట్‌కు ఏసీ సాధనాన్ని తయారు చేశారు. దీనికి ‘వాతానుకూల’ అని నామకరణం చేశారు. వేసవిలో చల్లగాను, చలికాలంలో వేడిగా ఉండటానికి ఈ పరికరాన్ని తయారు చేశారు. బహుళజాతి సంస్థలలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆర్‌టీ నగరకు చెందిన సందీప్‌ దహియా ఈ సాధనాన్ని అవిష్కరించారు. ఉపయోగదారుల ఉత్పత్తులను తయారు చేసే పరికరాలను విన్యాసం(డిజైన్‌) చేయటంలో సిద్ధహస్తుడిగా సందీప్‌ దహియాకు పేరుంది. ఆయన ఆర్‌టీనగరలో గ్యారేజీ కం వర్క్‌షాపును కూడా నడుపుతున్నారు. యువకుడు సందీప్‌ దహియా చేసిన ఏసీ హెల్మెట్‌పై అందరినీ అకర్షిస్తోంది. వీపుపై జాకెట్‌కు వెనుక తగిలించుకుని హెల్మెట్‌కు ఏసీ గాలి వచ్చేలా సాధనాన్ని తయారు చేశారు.  

నాలుగేళ్ల నుండి హెల్మెట్‌పై ప్రయోగం
గత నాలుగేళ్ల నుండి సందీప్‌ దహియా హెల్మెట్లపై అనేక ప్రయోగాలను చేస్తున్నారు. బైకుకు ఉయోగించే 12 ఓల్ట్‌ సామర్థ్యంగల బ్యాటరీ (డీసీ)ని ఇందుకు ఉయోగించారు. బెంగళూరు నగరంలాంటి ప్రాంతాల్లో సిగ్నల్స్‌ పడగానే తలలో వేడికి కొందరు హెల్మెట్లను తీసేస్తారు. అలా ఎందుకు తీయాలో ఒక అలోచన వచ్చింది. దీనిపై  సీరియస్‌గా దృష్టి సారించిన సందీప్‌ దహియా ఏసీ హెల్మెట్‌ను ఎలాగైనా తయారు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. నేను కూడా హెల్మెట్‌ జీవరక్షణ ధరిస్తున్నట్లు భావించా. హెల్మెట్‌ ధరించటంతో తలలో వేడి పుడుతుంది. దీంతో వెంట్రుకలు రాలిపోతున్నట్లు కొందరు అంటుంటారు. ఈ కారణంతో తను తయారు చేసే హెల్మెట్‌ అన్ని వాతావారణాలకు అనుకూలంగా ఉండలానే ఉద్దేశంతోనే ‘వాతానుకూల’గా హెల్మెట్‌కు పేరు పెట్టినట్లు సందీప్‌ దహియా వివరించారు. 

ఏర్‌ కూల్‌తో 1.7 కేజీలు  
మాములుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెల్మెట్‌ 8 వందల గ్రాముల నుండి రెండు కేజీలుంటాయి. అయితే ఈ హెల్మెట్‌ 1.7 కేజీల బరువు ఉంది. ఇందులో రెండు భాగాలుగా విభజించారు. వీపుపై బ్యాక్‌ప్యాక్‌తో ఏసీ పరికరాన్ని తగిలించుకోవాలి. అక్కడ నుండి రబ్బర్‌ ట్యాబ్‌ ద్వారా తలకు ధరించిన హెల్మెట్‌కు ఏసీ గాలిని అందిస్తుంది. వేడిని చల్లగా మార్చే ఏర్‌ కూలింగ్‌ పని చేస్తుంది. ఈ చల్లదనాన్ని అందిస్తున్న పరికరాలకు నీరు అవసరంలేదు. ఈ సాధనం సెమి కండక్టర్‌తో అనుసంధానం చేశారు. ఈ సాధనం ద్వారా వేడిని తగ్గించవచ్చు. పెచ్చుకోవచ్చు. హెల్మెట్‌కు బ్యాటరితో ఎలాంటి సంబధం లేదు. రబ్బర్‌ నుండి గాలిని హెల్మెట్‌కు అందిలా వ్యవస్థను కల్పించారు. ఏసీని నియంత్రించటానికి సాధనంలో ఒక చిన్న రిమోట్‌ను కూడా ఉపయోగించారు. ఇప్పుటి వరకు డిమాండ్‌ ఆధారంగా 40 మంది వినియోగదారులకు ఏసీ హెల్మెట్‌ను తయారు చేసి ఇచ్చినట్లు సందీప్‌ తెలిపారు. ఆర్‌టీ నగరలోని తన ఇంటీ నుండి యుబీ సీటీలో తను పని చేస్తున్న అఆఫీసు వరకు ఏసీ హెల్మెట్‌ను సందీప్‌ దహియా ఉపయోగిస్తున్నా రు. బైక్‌పై వెళ్తుండగా అనేక మంది వీపుపై ఉన్న యంత్రం ఏమిటని అడుగుతున్నారు. హెల్మెట్‌ ఏసీ అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నట్లు సందీప్‌ వివరించారు. దీనికి అవుతున్న ఖర్చును మాత్రం చెప్పటం లేదు. పరికరాల ఉపయోగాన్ని బట్టి ధరలుంటాయని సందీప్‌ తెలిపారు. కనీసం రూ. మూడు వేల నుండి ఏడు వేల వరకు ధర ఉండవచ్చు. 

మరిన్ని వార్తలు