కర్ణాటక మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

21 Jul, 2014 01:22 IST|Sakshi

బళ్లారి: కర్ణాటకలో ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, రవాణాపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ మైనింగ్ ఆరోపణలున్న పలు కంపెనీలకు గత వారం రోజులుగా నోటీసులు జారీ చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 2006 ఏప్రిల్ 1 నుంచి 2010 డిసెంబర్ 31 మధ్య కాలంలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, ఎగుమతులకు సంబంధించిన పత్రాలను అందించాల్సిందిగా ఆదేశించింది. 2006-07 నుంచి 2010 మధ్యలో 7.74 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా తరలించడం వల్ల ఖజానాకు భారీగా గండిపడిందని 2011లో అప్పటి లోకాయుక్త సంతోష్ హెగ్డే వెల్లడించిన సంగతి తెలిసిందే

మరిన్ని వార్తలు