కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌

24 Mar, 2018 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు చూపాలని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే సీబీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిల్‌పై బయట ఉన్న సమయంలో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు రూ.4.5 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న కార్తీని సీబీఐ అరెస్టు చేసింది. ఆ మేరకు కోర్టు విధించిన 12 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ శనివారంతో ముగియనుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు