నిలకడగా కరుణానిధి ఆరోగ్యం

16 Dec, 2016 14:12 IST|Sakshi

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ పార్టీ నేతలు కనిమొళి, ఇళంగోవన్‌ చెప్పారు. కరుణానిధి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, త్వరలో డిశ్చార్జి అవుతారని తెలిపారు. శుక్రవారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం డీఎంకే నేతలు మీడియాతో మాట్లాడుతూ కరుణానిధి ఆరోగ్య వివరాలను వెల్లడించారు.

ఈ రోజు మధ్యాహ్నం కావేరి ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గొంతులోను, ఊపిరితిత్తుల్లోను ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస అందడం కష్టం కావడంతో కరుణానిధిని డిసెంబర్ 15వ తేదీన ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది. ఆయనకు శ్వాస సులభంగా అందేందుకు ట్రాకొస్టమీ చేశామని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. ఆయనకు వైద్యుల బృందం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ అరవిందన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు