హృదయాన్ని కదిలిస్తోన్న ఫోటో

6 May, 2020 17:41 IST|Sakshi

శ్రీనగర్: ‌2017లో కశ్మీర్‌లో టెరరిస్టులు హతమార్చిన ఒక పోలీసు ఆఫీస్‌ కుమార్తె ఫోటోను జమ్మూ కశ్మీర్‌ పోలీసు ఆఫీసర్‌ ఇంతియాజ్‌ హుస్సేన్‌ తన ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో తన తండ్రి ఉగ్రవాదుల చేతిలో బలికావడంతో ఆ పాప ఏడుస్తోంది. ఇది చూసిన ఎవరి హృదయమయిన కరిగిపోవాల్సిందే. ఆయన ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ చిత్రం రాబోయే కాలంలో కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి మనసాక్షిని వెంటాడుతోంది. ఓదార్చడానికి కూడా వీలు లేకుండా ఏడుస్తున్న ఈ పాప 2017లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పోలీసు ఆఫీసర్‌ కూతురు. ఈ ఫోటోకి ఏమైనా అవార్డు లభిస్తుందా? అని ఇంతియాజ్‌ ట్వీట్‌ చేశారు. 

తాజాగా కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫోటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్‌, ముక్తార్‌ ఖాన్‌, దార్‌ యాసిన్‌లకు జీవిత చిత్రాలను చూపించినందుకు గాను పులిట్జర్‌ ప్రైజ్‌ 2020 లభించింది. దీంతో ఇప్పుడు ఈ అధికారి చేసిన పోస్ట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.  వీరి ముగ్గురికి అవార్డు ఇచ్చే సమయంలో పులిట్జర్‌ బోర్డు తన వెబ్‌సైట్‌లో ఇండియా కశ్మీర్‌ భూభాగంలో కమ్యూనికేషన్‌ని బ్లాక్‌ చేయడం ద్వారా కశ్మీర్‌  స్వాతంత్ర్యాన్ని పొగొట్టిన సమయంలో అక్కడవారిని జీవితాల్ని ప్రతిబింబించే ఫోటోలు ఇవి అని పేర్కొంది. ఈ విషయం మీద కాంగ్రెస్‌, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వీరికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ఒక ట్వీట్‌ చేశాడు. దేశం గర్వపడేలా చేశారు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీజీపీ నేత సంబిత్‌ పాత్ర భారత్‌కు వ్యతిరేకమైన భావాలను వర్ణించడం ద్వారా వారికి ఈ అవార్డు లభించిందని, అవార్డు అందుకున్న వారిలో ఒకరైన దార్‌ కశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా తన ఫోటోలలో పేర్కొన్నారని తెలిపారు.  అలాంటి వారికి అవార్డు వస్తే పొడగ్తలతో ముంచేత్తుతారా? రాహుల్‌, కశ్మీర్‌ భారతదేశ భూభాగం కాదా? అని సంబిత్‌ పాత్ర ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు