ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి

1 Mar, 2019 19:54 IST|Sakshi

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో ఉగ్రశిబిరాన్ని శిబిరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరగగా ఉగ్రవాది మరణించినట్లుగా నటించి దగ్గరకు వెళ్లిన జవాన్లపై బండరాళ్ల మధ్య నుంచి లేచి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉగ్రవాది కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ ఇన్స్‌పెక్టర్, ఒక జవాన్, జమ్ము కశ్మీర్‌కు చెందిన ఇద్దరు పోలీసులు చనిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.

మరోవైపు భారత పైలట్ అభినందన్‌ని అప్పగిస్తూనే శాంతి వచనాలు వల్లిస్తోన్న పాక్.. తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఎల్‌ఓసీ సమీపంలోని పూంఛ్ సెక్టార్‌ మేండర్, బాలాకోట్, కృష్ణా ఘాట్‌లలో మోర్టార్‌లతో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులకు భారత జవాన్లు కూడా అంతే దీటుగా జవాబునిస్తున్నారు.

మరిన్ని వార్తలు