జమ్మూ లో కర్ఫూ ఎత్తివేత

24 Jul, 2016 09:33 IST|Sakshi

శ్రీనగర్: రెండు వారాల ఘర్షణల అనంతరం జమ్ము కశ్మీర్  లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూని ఎత్తివేశారు. శ్రీనగర్ లోని కొన్ని  ప్రాంతాలతో పాటు నాలుగు జిల్లాల్లో నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. పరిస్థితి కొంచెం  మెరుగు పడిందని భావించిన ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. బందిపొరా, బారాముల్లా, బద్గమ్, గందర్బల్  జిల్లాలతో పాటు శ్రీనగర్ లోని కొన్నిప్రాంతాల్లో  కర్ఫూని ఎత్తివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కర్ఫూ ఎత్తివేసినా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పౌరులు గుంపులుగా సంచరించడానికి వీళ్లేదని  అధికారులు తెలిపారు. కర్ఫ్యూ లోయలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతనాగ్ , కుల్గామ్ , కుప్వారా , పుల్వామా మరియు షోపియాం జిల్లాల్లో అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  జులై 9 న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ వానీ ని భద్రతాదళాలు హతమార్చిన నాటి నుంచి  ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 45 మంది మృతి చెందారు.3,400 మంది గాయపడ్డారు.

రాజ్ నాథ్ కశ్మీర్ పర్యటన:
రెండురోజులు పర్యటన నిమిత్త రాజ్ నాథ్ ఈరోజు ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. ఈ రోజు ప్రభుత్వ అధికారులు, సామాజిక సంఘాలు, పలు రాజకీయపక్షాలతో సమావేశమవనున్నారు. రేపు కూడా రాజ్ నాథ్ పలువురితో చర్చలు జరుపనున్నారు.

 

మరిన్ని వార్తలు