ఏకే 47 బుల్లెట్లు దిగినా..

6 Jun, 2016 11:02 IST|Sakshi
ఏకే 47 బుల్లెట్లు దిగినా..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు.

ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు.

మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు.

మరిన్ని వార్తలు