వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌

21 Jul, 2020 20:38 IST|Sakshi

శ్రీనగర్‌ : కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, ఏకంగా ఓ మాస్క్‌ను పాఠకులకు ఉచితంగా ఇచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన స్థానిక ఉర్దూ పత్రిక రోష్నీ, తమ ముందు పేజీలో ఓ మాస్క్‌ను అంటించి తమ పాఠకులకు అందించింది. (అంత లేదు, కేసుల సంఖ్యతో పరేషాన్‌ కావొద్దు)

‘ఈ సందేశాన్ని ప్రజలకు పంపించడం ఈ సమయంలో ముఖ్యమని మేము భావించాము. మాస్క్‌ ధరించాలనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేయడానికి ఇది మంచి మార్గం’ అని రోష్ని ఎడిటర్ జహూర్ షోరా అన్నారు. (అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం)

ఇక రోష్ని పత్రిక చూపించిన చొరవను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా కట్టడిపై కేవలం సూచనలకే పరిమితం అవ్వకుండా పాఠకులకు మాస్క్‌లను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సోమవారం ఒక్క రోజే 751 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, పది మంది మృతిచెందారు. మొత్తంగా 13,899 కేసులు నమోదవ్వగా 244 మంది మృతిచెందారు.

మరిన్ని వార్తలు