‘కశ్మీరీ’ సివిల్స్‌ టాపర్‌ రాజీనామా

10 Jan, 2019 03:47 IST|Sakshi
షా ఫజల్‌

కశ్మీర్‌ కేడర్‌ ఐఏఎస్‌ షా ఫజల్‌ సంచలన నిర్ణయం

శ్రీనగర్‌: జమ్మూ, కశ్మీర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి షా ఫజల్‌ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ఫస్ట్‌ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఆయన చరిత్ర సృష్టించారు. ఐఏఎస్‌ అధికారి అయినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలపై నిత్యం స్పందిం చే వారు. కశ్మీర్‌లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హత్యలను అరికట్టేం దుకు కేంద్రం చర్యలు తీసుకో వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు.

కొన్ని హిందుత్వ శక్తుల చేతుల్లో 20 కోట్ల భారతీయ ముస్లింలు వివక్షకు గురవుతు న్నారని,వారిని పక్కకు పెడుతున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో జరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ.. ఫజల్‌ ఆరు నెలల కింద ఓ ట్వీట్‌ చేశారు. వెంటనే ఆయనపై జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత శిక్షణ కోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చిన ఫజల్‌.. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా.. కేంద్రంపై పలు విమర్శలు చేశారు. ‘ఆర్‌బీఐ, సీబీఐ, ఎన్‌ఐఏ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప కట్టడాన్ని కూలదోయాలని చూస్తున్నారని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఫజల్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలో చేరతారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు