కోట్లు తెచ్చిపెట్టిన 9 ప్రశ్నలు..!

3 Sep, 2018 19:56 IST|Sakshi

దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన టీవీ షోలలో ‘‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’’ది ఓ ప్రత్యేక స్ధానం. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ‍్యవహరించిన ఈ కార్యక్రమంలోకి ఒట్టిచేతుల్తో వచ్చి కోట్ల రూపాయలు పట్టుకెళ్లిన వారు ఉన్నారు.. సమాధానం చెప్పలేక చివరి క్షణంలో కోట్లు చేజార్చుకున్నవారు ఉన్నారు. ఈ షోలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం మామూలు విషయం కాదు!

మేథో సంపత్తి కలిగిన ఏ కొద్దిమంది మాత్రమే సరైన సమాధానాలు చెప్పగలిగారు. ప్రస్తుతం ఈ షో 10వ సిరీస్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బీ అడిగిన ఆ 9 ప్రశ్నలు.. కంటెస్టంట్లకు కోట్లు గెలిపించిపెట్టిన సమాధానాలు మీ కోసం.  మరి మీకు ఏ మాత్రం సమాధానాలు తెలుసో?  చూసుకోండి..

1) ఈ క్రింది వారిలో ఏ కళాకారునికి భారతదేశ రాజ్యాంగ నిజప్రతిని అందంగా తీర్చిదిద్దే బాధ్యతలు అప్పగించారు?

రామ్ కింకర్ బెయిజ్

బెనోడ్ బీహారీ ముఖర్జీ

అబనీంద్రనాథ్ టాగోర్

నందలాల్ బోస్

2. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనడానికి భారత రాజ్యాంగం ఎవరిని అనుమతించింది?

సొలిసిటర్ జనరల్

అటార్నీ జనరల్

క్యాబినెట్ కార్యదర్శి

ప్రధాన న్యాయమూర్తి

3. యూరోపియన్ వలస శక్తులు భారతదేశంలోని ఈ కింది కోటలలో దేనిని నిర్మించలేదు?

ఫోర్ట్ డాన్స్‌ బర్గ్‌

ఫోర్ట్ నారెన్

ఫోర్ట్ చాంబ్రా

ఫోర్ట్ శాంటా కాతేరినా

4. అక్టోబరు 18, 1868 న బ్రిటిష్ వారికి నికోబార్ దీవుల హక్కులను భారతదేశంలో స్వాధీనం చేసిన వలసరాజ్య వ్యవస్థ ఏది?

బెల్జియం

ఇటలీ

డెన్మార్క్

ఫ్రాన్స్

5. ప్రపంచంలోని రెండవ ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు?

జంకో టబాయ్

వండ రుట్కివిజ్

తామే వతనాబే

చంటల్ మౌడుయి

6. 1978లో అంటార్కిటికా ఖండంలో జన్మించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

ఎమిలియో పాల్మ

జేమ్స్ వెడెల్

నతనియేల్ పాల్మెర్

చాలెస్ విల్కెస్

7) సూరత్‌ వద్దకు చేరుకున్న మొట్టమొదటి బ్రిటీష్‌ వాణిజ్య ఓడరేవైన ‘హెక్టార్‌’కు సారథ్యం వహించింది ఎవరు?

పాల్ కానింగ్

విలియం హాకిన్స్

థామస్ రో

జేమ్స్ లాంకాస్టర్

8) 2017లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొన్నగెలాక్సీల సూపర్‌ క్లస్టర్‌కు పెట్టబడిన పేరు ఏమిటి ?

లక్ష్మీ

పార్వతి

సరస్వతి

దుర్గ

9. ఈ క్రింది వారిలో రక్తసంబంధం లేని ఏ ఇద్దరు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు?

మేరీ క్యూరీ, ఐరీన్ జొలిట్ క్యూరీ

జేజే థామ్సన్, జార్జి పాగెట్ థామ్సన్

నీల్స్ బోర్, ఆగే బోర్

హెర్మన్ ఎమిల్ ఫిస్చెర్, హన్స్ ఫిస్చెర్

సమాధానాలు:

1. నందలాల్ బోస్

2. అటార్నీ జనరల్

3. ఫామ్ చాంబర్

4. డెన్మార్క్

5.వాండ రుట్కివిజ్

6. ఎమిలియో పాల్మ

7. విలియం హాకిన్స్

8. సరస్వతి

9) హెర్మాన్ ఎమిల్ ఫిస్చెర్, హన్స్ ఫిస్చెర్

మరిన్ని వార్తలు