భ‌క్తులు లేకుండానే డోలి యాత్ర‌

29 Apr, 2020 11:42 IST|Sakshi

డెహ్ర‌డూన్ : ఆరు నెల‌ల పాటు మంచుతో క‌ప్ప‌బ‌డిన కేథ‌ర్‌నాథ్ ఆల‌యం బుధ‌వారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్త‌జ‌న సందోహం త‌ర‌లివస్తారు. కానీ క‌రోనా కార‌ణంగా ఈ సంవ‌త్స‌రం భ‌క్తులెవ‌రినీ  అనుమ‌తించ‌లేదు. తాత్కాలిక ఆల‌యం ద‌ర్శ‌నం ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆల‌య ప్ర‌ధాన పూజారి స‌హా అతికొద్దిమంది స‌మ‌క్షంలో ఉద‌యం  విగ్ర‌హాన్ని ఆల‌యానికి తీసుకువ‌చ్చారు. ( ‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’ )

 చార్‌ధామ్ యాత్ర‌లో అతి ముఖ్య‌మైన డోలి యాత్రలో నిజాన‌కి భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సంద‌డి లేదు.  చార్‌ధామ్‌ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను  ద‌ర్శించేందుకు  ప్రతి సంవత్సరం దేశ‌, విదేశాల నుంచి  లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భ‌క్త జ‌న కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆల‌య అర్చ‌కులు. ఐదుగురు పండితులు కేథ‌ర్‌నాథ్ ఆల‌యానికి పంచ‌ముఖీ స్వామిని ప‌ల్ల‌కిలో తీసుకువ‌చ్చారు.
 

అత్యంత మంచుతో నిండిన ప్రాంతం అయినప్ప‌టికీ  పండితులు చెప్పులు లేకుండానే యాత్ర కొన‌సాగించారు. సాధార‌ణంగా హిందూ పంచాగం ప్ర‌కారం తీర్థ‌యాత్ర‌లు తేదీలు ఫిబ్ర‌వ‌రిలో శివ‌రాత్రి సంద‌ర్భంగా నిర్ణ‌యిస్తారు. కానీ ఈ సంత్స‌రం  క‌రోనా క‌ట్ట‌డి నేప‌థ్యంలో అన్ని  తీర్థ‌యాత్ర‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యించారు. కొన్ని ప్ర‌ముఖ ఆల‌యాల‌కు అనుమ‌తి ఉన్నా భ‌క్తులను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌రు.  

మరిన్ని వార్తలు