ఇలా చేస్తే కరోనానుంచి నిశ్చింత

25 Mar, 2020 18:54 IST|Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. ఈ రక్కసిని అరికట్టేందుకు ఉన్న అత్యంత సులువైన మార్గం సామాజిక దూరం( సోషల్ డిస్టెన్సింగ్)‌. ప్రతి ఒక్కరూ దీన్ని విధిగా పాటించాల్సి ఉన్నా.. డాక్టర్లూ, నర్సులు, మీడియా... ఇలా అత్యవసర విభాగాల్లో పనిచేసేవారు నిత్యం ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కాస్త కష్టమైన పనే. లాక్‌డౌన్‌ గురించి అందరికీ తెలిసినప్పటికీ దాన్ని ఆచరించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా బయటి వ్యక్తులను కలుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు భారతీయుల మదిలో నెలకొన్న ప్రశ్న ఏంటంటే... తాము కరోనా భారిన పడ్డామా? లేదా.. కరోనా బాధితులను కలిశామా? అన్నది. ఈ వ్యాధి లక్షణాలు 14 రోజుల తర్వాత కానీ బయటపడకపోవటమే ఇందుకు కారణం. 

ఇప్పటికే మన దేశం కరోనా వ్యాధి సంక్రమణలో రెండవ దశలో ఉంది. మూడవ దశలోకి వెళ్తే.. సమస్యను అదుపు చేయలేము. ఇటలీ కంటే మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా సోకిన వారిని గుర్తించినా, ఇంతకు ముందు వారు ఎవరెవరిని కలిశారన్నది తెలుసుకోవడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాలు. దీన్ని ఛేదించాలంటే ప్రతీ భారతీయుడు ఒక లాగ్‌ షీట్‌ నియమాన్ని పాటించాలి. మీరు ప్రతిరోజూ ఎవరెవరిని కలిశారు? ఎవరెవరితో మాట్లాడారు అన్న సమాచారాన్ని సోషల్‌ డిస్టెన్స్‌తో సంబంధంలేకుండా ఎప్పటికప్పుడు పొందు పరచాల్సి ఉంటుంది. ఇలా 30 రోజుల పాటు ప్రతి 15 రోజుల కొకసారి ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇలా 3 రోజులు అయ్యాక.. మీరు ఎవరెవరిని కలిశారో వారి ఆరోగ్య వివరాలు తెలుసు కోవాల్సి ఉంటుంది. వారిలో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే 104 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ లాగ్‌ షీట్‌లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఎవరెవరిని కలిశారన్నది కచ్చితంగా పొందుపరచాలి. ఇలా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా లాగ్‌ షీట్‌ నియమాన్ని పాటించాలి. ఒకవేళ మీలో వ్యాధి లక్షణాలు కనబడితే దీని ద్వారా మీకు సంబంధించిన డేటాను సేకరించడం సులభమవుతుంది. అంతే కాకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి కరోనా లక్షణాలు ఏమైనా బయట పడుతున్నాయా? లేదా తమకు ఆ వ్యాధి సోకిందో లేదో అన్న భయాందోళన నుంచి బైట పడొచ్చు. ప్రతీ పౌరుడు ఇలా బాధ్యతగా లాగ్‌ షీట్ నియమాన్ని పాటించడం ద్వారా ప్రతి రోజూ ఎంత మందిని కలుస్తున్నాము? అసలు అవసరం ఉన్నా లేకున్నా అంత మందిని కలవడం ఎంత వరకు మంచిది అనే విషయాలపై ఒక స్పష్టత వచ్చి సోషల్ డిస్టెన్సింగ్‌ విలువ తెలుస్తుంది.

మీ వివరాలు నమోదు చేయటానికి అవసరమైన లాగ్‌ షీట్‌ ఫార్మాట్‌

మరిన్ని వార్తలు