మందుబాబుల కోసం స‌రికొత్త వ్యూహం

8 May, 2020 11:38 IST|Sakshi

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మ‌ద్యం విక్ర‌యాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు మందు బాబులు బారులు తీరారు. అన్ని మ‌ద్యం షాపుల ముందు కిలోమీట‌ర్ల మేర క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. క‌నీసం భౌతిక దూరం పాటించ‌కుండా ఒకరి మీద తోసుకుంటూ లిక్క‌ర్ కోసం ఎదురు చూసిన దృశ్యాలు అనేకం. దీంతో కొన్ని రాష్ట్రాల్లో మ‌ద్యం షాపులు తెరిచిన వెంట‌నే మ‌ళ్లీ మూసివేశారు. అక్క‌డ‌క్క‌డా పోలీసులు లాఠీల‌కు ప‌నిచెబుతున్నా జ‌నం లెక్కచేయ‌కుండా  షాపుల ముందు బారులు తీరుతున్నారు.

ఈ స‌మ‌స్య‌ను చెక్ పెట్టేందుకు కేజ్రివాల్  ప్ర‌భుత్వం కొత్త ప్ర‌ణాళిక‌ను ర‌చించింది. ఈ-టెకెన్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఇక‌పై మ‌ద్యం కొనాలంటే టోకెన్ విధానాన్ని అనుస‌రించాల్సిందే. టోకెన్ నెంబ‌ర్ ఆధారంగా ఆ టైంలోనే మ‌ద్యం షాపుల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ముందుగా వివ‌రాలు న‌మోదుచేసు‌కున్న వారు ఆ స‌మ‌యానికి  వెళ్లి నేరుగా మ‌ద్యాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. (మహమ్మారితో మనుగడ సాగించాల్సిందే.. )

మరిన్ని వార్తలు