డాక్ట‌ర్ గుప్తా కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం

3 Jul, 2020 17:51 IST|Sakshi

వారి కుటుంబాల‌ను ఆదుకోవ‌డం ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యం

ఢిల్లీ :  క‌రోనాతో పోరాడుతూ మ‌ర‌ణించిన వైద్యుడు అసీమ్ గుప్తా (52 ) కుటుంస‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా న‌ష్ట ప‌రిహారంగా కోటి రూపాయ‌ల చెక్కును కుటుంబ‌స‌భ్యుల‌కు అంద‌జేశారు. ఇత‌రుల కోసం ప్రాణాలు  ప‌ణంగా పెట్టి వైద్య సేవ‌లందించిన వారి కుటుంబాల‌ను ఆదుకోవ‌డం ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యం అని కేజ్రివాల్ పేర్కొన్నారు. అసీమ్ గుప్తాను పీపుల్స్ డాక్ట‌ర్‌గా అభివ‌ర్ణించిన సీఎం..చనిపోయిన వారిని తీసుకురాలేమని, కానీ వారి కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. క‌రోనా చికిత్స‌లో భాగంగా విధులు నిర్వ‌ర్తించే వైద్యులు దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్‌ )

ఢిల్లీలోని ప్ర‌భుత్వ ఎల్ఎన్‌జెపి ఆసుప‌త్రిలో క‌న్స‌ల్టెంట్ అన‌స్థీషియాల‌జిస్ట్ అసీమ్ గుప్తా.. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప‌లువురు క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించారు. ఈ నేప‌థ్యంలో జూన్ 6న డాక్ట‌ర్ గుప్తాకు క‌రోనా సోకడంతో క్వారంటైన్‌కి త‌ర‌లించారు. అయినా ప‌రిస్థితిలో మార్పు రాక‌పోగా ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీంతో జూన్7న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి త‌ర‌లించారు. త‌ర్వాత అక్క‌డ్నుంచి ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ఆదివారం క‌న్నుమూశారు. (జులై 31 వరకూ విమాన సేవలు రద్దు )

మరిన్ని వార్తలు