'వాళ్ల అరెస్టు దిగ్భ్రాంతికి గురిచేసింది'

19 Aug, 2015 11:25 IST|Sakshi
'వాళ్ల అరెస్టు దిగ్భ్రాంతికి గురిచేసింది'

న్యూఢిల్లీ : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులను అరెస్టు చేయడం తనను దిగ్భ్రాంతికి  గురిచేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు కొంత స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున ఎఫ్టీఐఐకి చెందిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన కేజ్రీవాల్, క్లాసులు నిర్వహించేందుకు కొంత స్థలాన్ని ఢిల్లీలో కేటాయిస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గొప్పదనం ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల మసక బారుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఇప్పుడు కేటాయించిన స్థలంలోనే పూర్తి స్థాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గా మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు