‘రాజధాని’ స్టాప్‌లు పెంచండి: సీఎం

13 May, 2020 11:27 IST|Sakshi

తిరువనంతపురం: ప్రయాణికుల కోసం వేసిన ప్రత్యేక రైళ్లను కేరళలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. ఎయిర్‌కండిషన్డ్‌(ఏసీ) రైళ్లకు బదులుగా నాన్ ఎయిర్ కండిషన్డ్ రైళ్లను నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏసీ రైళ్లలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!)

‘మామూలు సమయాల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కేరళలో ఎన్ని చోట్ల ఆగుతుందే అదేవిధంగా ప్రత్యేక రాజధాని రైళ్లు కూడా ఆగేందుకు అనుమతించాలని రైల్వే శాఖను కోరాం. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా ముప్పు రాకుండా చూసేందుకు కేరళలోకి ప్రవేశించే వరకు రైళ్లను నాన్ స్టాప్ సర్వీసులుగా నడపాలని అడిగామ’ని మీడియాతో విజయన్‌ చెప్పారు. ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కోజికోడ్‌లలో మాత్రమే ప్రత్యేక రాజధాని రైళ్లకు స్టాప్‌ ఉంది. దీంతో ఉత్తర ప్రాంత జిల్లాలైన కాసర్‌గడ్‌, కన్నూరు జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. వీరంతా కర్ణాటకలోని మంగళూరులో దిగి స్వస్థలాలకు చేరుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తోందని రేల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో  స్టాప్‌లు పెంచాలని ఆయన కోరారు. 

మరోవైపు రైల్వే స్టేషన్లలో విస్తృతమైన పరీక్షా ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నామని, రైళ్లలో వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అని విజయన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కేరళ ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే రైల్వే టికెట్ ఉన్నవారు కోవిడ్ -19 జాగ్రత్త పోర్టల్‌లో రాష్ట్ర ఎంట్రీ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అది లేని వారిని స్టేషన్ నుంచే సంస్థాగత నిర్బంధానికి (ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌) తరలించబడతారు. (లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం)

Poll
Loading...
మరిన్ని వార్తలు