పసికందును చర్చిలో వదిలేశారు..

2 Jun, 2018 16:22 IST|Sakshi

కొచ్చి: నవ మాసాలు మోసిన ఆ తల్లికి పుట్టిన రెండు రోజులకే పాప నచ్చలేదో.. ఆ తండ్రికి ఆ బిడ్డ ఏం పాపం చేశాడో..లేక ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ రెండు రోజుల పసికందుని చర్చిలో వదిలేసి వెళ్లారు ఓ జంట. ఈ విచార ఘటన కేరళలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళలోని త్రిశూర్‌ సమీపంలోని సెయింట్‌ జార్జ్‌ ఫోర్నే చర్చి వద్ద శుక్రవారం సాయంత్రం ఓ జంట రెండు రోజుల పసికందుని వదిలి వెళ్లారు. వారు వెళ్లాక కొద్ది సేపటికి అక్కడి భద్రత సిబ్బందికి పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూసే సరికి చర్చి ప్రాంగణంలో పసికందు ఏడుస్తూ కనిపించింది.

వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ పాపను ఆసుపత్రికి తరలించారు.సీసీ పుటేజీ పరిశీలించగా శుక్రవారం సాయంత్రం 8.15గంటలకు ఆ జంట మరో బిడ్డతో వచ్చి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్లారు. వెళ్లే ముందు పాప నుదిటిపై ఓ ముద్దు కూడా పెట్టారు. ఇదంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా పాప తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాపను వదిలి వెళ్లాడానికి గల కారణాలు విచారణ తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు