తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం

25 Apr, 2020 17:32 IST|Sakshi
కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ (ఫైల్ ఫోటో)

కేరళలో తీవ్ర ఆర్థిక సంక్షోభం

ఉద్యోగుల వేతనాల్లో   కోత

5 నెలల పాటు 6 రోజుల జీతం తగ్గింపు

సాక్షి, తిరువనంతపురం : వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే గాడ్స్ ఓన్ కంట్రీ  కేరళ ఇపుడు కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతోంది.  కరోనా విలయం, లాక్‌డౌన్ తో  రాష్ట్రం భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి  టి.ఎం థామస్ ఐజాక్ శనివారం ఆందోళన వెలిబుచ్చారు.  లాక్ డౌన్ విధించిన నెల రోజుల తరువాత  ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం  కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు.

కేంద్రం ఇచ్చేదానిని చేర్చినట్లయితే,  రాష్ట్ర ఖజానా రూ .2,000 కోట్లకు చేరుతుంది. జీతాల చెల్లింపు కోసం  తమకు 2,500 కోట్ల రూపాయలు అవసరమని ఐజాక్  తెలిపారు. దీంతోప్రస్తుత పరిస్తితుల్లో ట్రెజరీని మూసివేయాల్సిన పరిస్థితి రానుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నెల జీతం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ అభ్యర్థించామన్నారు. ఈ నిధులను  సిఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌ తరలించి బాధితుల అవసరాలకు వినియోగించాలన్న ఉద్దేశంతోనే  ఈనిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ సహా  వివిధ సిబ్బంది సంస్థలు  వ్యతిరేకించడంతో  ఈ విషయంలో ముందుకు పోలేకపోతున్నామని, ప్రతి నెలలో ఆరు రోజుల జీతం ఐదు నెలల వరకు కోత విధింపునకు నిర్ణయించామన్నారు. వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం సమయంలో ఇదే  ఏకైక మార్గంగా భావించామని, ఈ డబ్బును తిరిగి చెల్లిస్తామని ఆయన చెప్పారు. (కరోనా: ఈ వీడియో చాలా ప్రత్యేకం) (అద్భుతం : మనకీ ధైర్యం పెరుగుతుంది)

క‌రోనాతో దెబ్బ‌తిన్న ఆర్థిక ప‌రిస్థితిని  చక్కదిద్దేందుకు ఉద్యోగుల నెల జీతంలో కోత విధిస్తూ కేర‌ళ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట మంత్రివ‌ర్గం ఆమోదం లభించిన ఈ నిర్ణయం ప్ర‌కారం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర అనుబంధ పరిశ్రమలు, యూనివర్శిటీలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నెల జీతంనుంచి  6 రోజుల జీతం కోత అయిదు నెలలపాటు వుంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. (ఇ-కామర్స్‌ కంపెనీలకు మరో షాక్)

మరిన్ని వార్తలు