భారత్‌లో మూడో ‘కరోనా’ కేసు

3 Feb, 2020 13:02 IST|Sakshi

తిరువనంతపురం: చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌కు భయపెడుతోంది. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని  కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా నిర్థారించారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.కాగా, కరోనా వైరస్‌ వల్ల ఇప్పటికే చైనాలో 300 మందికి పైగా మృతి చెందారు. అలాగే 15 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది.

(చదవండి : కరోనా డేంజర్‌ బెల్స్‌)

కరోనా వైరస్ త్వరగా వ్యాప్తిచెందడంతో భారత్‌ అప్రమత్తమైంది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల యంత్రాంగాలు  ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు