కేరళలో బస్‌ చార్జ్‌ల పెంపు

1 Jul, 2020 21:00 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్‌డౌన్‌వేళ ఆర్టిసీ సేవలు నిషేధించబడ్డాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన నష్టాల్లో ఉన్న కేఎస్‌ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయాణికుల టికెట్‌ ధరను 25శాతం పెంచినట్లు ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థను ఆదుకోవాలనే ఉద్దేశంతో తాత్కాలిక ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి నియమించిన జ్యుడీషియల్‌ కమిషన్ బస్సు చార్జ్‌ల పెంపును సిఫారసు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. (రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌‌ పర్యటన)

గతంలో 5 కిలోమీటర్ల ప్రయాణానికి సాధారణ టికెట్‌ ధర రూ.8గా ఉండేది. కానీ ప్రస్తుతం పెంచిన ధరలు అమల్లోకి వస్తే కేవలం మొదటి 2.5 కిలో మీటర్ల దూరానికి ప్రయాణికులపై రూ.8 చార్జ్‌ చేయాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. ఇక టికెట్‌ చార్జ్‌ల పెరుగుదల తాత్కాలికమేనని తెలిపారు. అదే విధంగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ చార్జ్‌లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు ప్రయాణ చార్జ్‌లు పెంచాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసింది.

మరిన్ని వార్తలు