ఘోర ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు 

20 Feb, 2020 20:40 IST|Sakshi

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని అవినాషిలో కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ .10 లక్షల ఎక్స్‌గ్రేషి యా ప్రకటించింది.  అత్యవసర సహాయంగా రూ .2 లక్షలు వెంటనే అందిస్తామని రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా కేరళ ప్రభుత్వం భరించనుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు ఇచ్చినట్లు  సీఎం కార్యాలయం ఒక ప్రకటన  విడుదల చేసింది. అలాగే మృతుల బంధువులు తమ వస్తువులను తీసుకొనేందుకు పాండి పోలీస్ స్టేషన్ అధికారులను 8300044804 లేదా 9498177908 నెంబర్‌లో సంప్రదించవచ్చని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్డి బాలమురళి  తెలిపారు.  మృతదేహాలను తీసుకురావడానికి కేరళ ఇప్పటికే 20 అంబులెన్స్‌లను కోయంబత్తూరుకు పంపించినట్టు చెప్పారు.

ప్రమాదంలో మరణించిన కేఎస్‌ఆర్టీసీ  డ్రైవర్‌, కండక్టర్‌

ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన  కేఎస్‌ ఆర్టీసీ డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు

అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కేరళ ఆర్టీసీ వివిధ బీమా పథకాల ప్రకారం ఒక్కొక్కరికి రూ.30 లక్షలు పొందనున్నారని ససీంద్రన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు కూడా మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగినట్టు సమాచారం. స్వల్ప గాయాలతో 20 మంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు