మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం

28 Dec, 2019 06:27 IST|Sakshi

తిరువనంతపురం: గూఢచర్యం కేసులో నిరపరాధిగా విడుదలైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం ఇవ్వాలని కేరళ  ప్రభుత్వం నిర్ణయించింది. 1994లో దేశ రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై నారాయణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని 77 ఏళ్ల నారాయణన్‌ కేసు దాఖలు చేయగా కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం, మానవ హక్కుల కమిషన్‌ ఈ కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షలు, రూ. పది లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పివ్వడం తెల్సిందే. తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన రూ.1.3 కోట్లు సుప్రీంకోర్టు పరిహారానికి అదనం. నారాయణన్‌ లేవనెత్తిన అంశాల పరిశీలనకు ప్రభుత్వం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించగా ఆయన రూ.1.3 కోట్ల పరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు.

మరిన్ని వార్తలు