కరోనా: కేఎస్‌ఆర్‌టీసీ కీలక నిర్ణయం

19 May, 2020 20:00 IST|Sakshi

ఆర్టీసీ బస్‌ టికెట్లపై 50 శాతం బాదుడు షురూ

కనీస  చార్జి రూ.12

టికెట్ల రేట్లు పెంచినా కార్పొరేషన్‌కి భారీ నష్టం

కొచ్చి: కరోనా వైరస్‌ సంక్షోభం తరువాత కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా  అంతర్‌ జిల్లా సేవలకు ప్రభుత్వం బుధవారం అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో కేఎస్‌ఆర్‌టీసీ టికెట్ల ధరలను 50 శాతం పెంచేసింది. కీలక సమయాల్లో సాధ్యమైన ఎక్కువ బస్సులను  బుధవారం నుంచి నడపనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ.కె.ససీంద్రన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, సూచనలను ప్రతి డిపోకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

కేవలం 50 శాతానికి మాత్రమే అనుతి వుండటంతో టికెట్ ధర 50 శాతం పెంచినప్పటికీ, కార్పొరేషన్ రోజుకు రూ .42 లక్షల నష్టాన్ని చవిచూస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తాత్కాలికంగా టికెట్ రేటును 50 శాతం పెంచింది. కనీస ఛార్జీలను రూ. 8 నుండి రూ. 12కు పెంచింది. అలాగే అన్ని ఆర్టీసీ యూనిట్లకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు పంపిణీ చేయడంతోపాటు, సిబ్బంది, ప్రయాణీకులకు ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం.ప్రయాణీకులు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా  పాటించాలి.  బస్సు ఎక్కే ముందు శానిటైజర్ ఉపయోగించాలి. (కరోనా: వారికి ఎం అండ్‌ ఎం బంపర్‌ ఆఫర్లు)

50శాతం సామర్థ్యంతో 25 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో బస్సులు నడపడానికి అనుమతి లేదు.డబుల్ సీటర్లలో ఒకే ప్రయాణీకుడికి, మూడు సీట్లలో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే అనుమతి వుంది. మరోవైపు ప్రజా రవాణాలో  కీలక మైన ప్రైవేట్ బస్సుల  సర్వీసులు  తిరిగి ప్రారంభించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు