విముక్తి పొందావు; హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా!

12 Jun, 2019 14:42 IST|Sakshi

‘అసలు ఇలాంటి ఒక నోట్‌ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. ఆధునిక కాలంలో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే సమాజంలో మనం ఉన్నాం. ఎవరైతే అనుమానం, జాలి, ద్వేషం వంటి భావనలు కలిగి ఉంటారో.. దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఏమైనా అన్నా సరే. దాని పట్టించుకునే వాళ్లెవరూ లేరు ఇక్కడ. అవును ఈ పోస్టు మా అమ్మ పెళ్లి గురించి’ అంటూ కేరళకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ అనే అబ్బాయి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు పలువురిని ఆలోచింపజేస్తుంది. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తార్కాణంగా నిలిచింది.

తల్లిదండ్రులు మాత్రమేనా?!
దైవభూమిగా పేరుగాంచిన కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి అతడి చిట్టి గుండెకు కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన.. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా స్త్రీని ఒక బొమ్మలా భావించే తండ్రి మూర్ఖత్వానికి.. అమ్మ జీవితం చెరలో చిక్కుకుందే అనే అపరాధ భావన ..గోకుల్‌కు మనశ్శాంతి లేకుండా చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అతడి మానసిక సంఘర్షణకు తెరపడింది. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్‌ ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి.

రక్తం కారుతున్నా లెక్కచేయలేదు..
‘నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆమె వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు ఆమెతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. అవును ఆమె ఎవరో కాదు మా అమ్మ. నా కోసం తన కలలు త్యాగం చేసిన మాతృమూర్తి. మేము ఇళ్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నీ జీవితం సంతోషంగా గడవాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్‌ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంతేగాక నెగటివ్‌ కామెంట్లు చేసేవారు ఈ పోస్టు చూసి అనవసరంగా సమయం వృథా చేసుకోకండి అని సలహా కూడా ఇచ్చాడు. అయితే అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్‌ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘క్రయోజనిక్‌’లో లీకేజీ వల్లే..

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

చెన్నైలో భారీ వర్షం

గవర్నర్‌ ఒక కీలుబొమ్మ.. అవునా?

‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’

ఈనాటి ముఖ్యాంశాలు

రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’