వరద బీభత్సం : ప్లీజ్‌ నన్ను కాపాడండి

16 Aug, 2018 17:04 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వరద తాకిడి తీవ్రతరమవడంతో కేరళ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సహాయ, పునరావాస శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే పునరావాస శిబిరాల్లోకి కూడా నీరు చేరడంతో... ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తుంటే కేరళ వాసులు ఎంత భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది.

ప్లీజ్‌ నన్ను కాపాడండి....
‘వరద నీటితో మా ఇళ్లంతా నిండిపోయింది. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దయచేసి నన్ను కాపాడండి’ అంటూ కేరళ రాష్ట్ర అధికారులకు చెన్నంగూర్‌కు చెందిన వ్యక్తి విఙ్ఞప్తి చేశారు. ‘సమయం గడుస్తున్న కొద్దీ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నేను రెండో అంతస్తులో ఉన్నాను. ఇక్కడ కూడా నా తల వరకు నీరు వచ్చేసింది. అధికారులు గానీ, స్థానిక రాజకీయ నాయకులు గానీ ఒక్కరు కూడా ఇటువైపు రాలేదు. ఈ వీడియోను చూసైనా నన్ను కాపాడంటూ’  దీనంగా అర్థించాడు.ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 

మరిన్ని వార్తలు