​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

20 Jul, 2019 15:56 IST|Sakshi

వాటర్‌ బడ్జెట్‌ను ​ప్రవేశపెట్టనున్న కేరళ

అనేక జీవనదులకు పుట్టినిళ్లు భారతదేశం. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో నీటి కొరత ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పట్టణాలను మనం చూస్తున్నం. ముంబైలోని లాథూర్‌కి నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి చెన్నై మహానగరంలో కూడా సంభవించింది. ఇంతటి నీటి సమస్య గత వందేళ్లలో కూడా రాలేదని చెన్నై వాసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకముందే కేరళ కళ్లుతెరిచింది. దేశంలో తొలిసారి వాటర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.

తిరువనంతపురం: భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలోభాగంగానే ప్రతి ఏటా వాటర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంతనీటి లభ్యత ఉంది. ఎంత అవసరం కానుంది, వంటి అంశాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. పక్క రాష్ట్రాల కష్టాలను చూసి భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని కేరళ జాగ్రత్త పడుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.కేరళలో ఎంత నీరు అందుబాటులో ఉంటుంది, ఎంత నీరు వాడుకలో ఉంటుంది, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం, అదనపు నీటి కోసం ఉన్న వనరులేంటి? వంటి అంశాల్ని బడ్జెట్‌లో వివరించబోతోంది.

తొలి రాష్ట్రం కేరళనే..
అవసరాల దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నీటి వాడకం మరింత పెరుగుతుందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానమైన అంశం ఏంటంటే... దేశంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం కేరళనే. నీటిని ఎలా పొదుపుచెయ్యాలి, అందుకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాల్ని ఈ బడ్జెట్‌లో చెప్పబోతున్నారు.అలాగే దీనిపై ప్రజలకు, అధికారులకు అవగహన కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఈ ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఎంత నీరు తెలుసుకునే వీలు ఉంటుందని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి కొరత ఉంటే.. అక్కడికి నీటిని ఎలా తరలించాలి, అందుకోసం ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, అంచనా ఖర్చులు ఎంత అన్నది బడ్జెట్‌లో పొందుపరచే అవకాశం ఉంది.

ప్రళయం నుంచి పాఠాలు..
నదులు, చెరువు, బావులు, కుంటలు, రిజర్వాయర్లు ఇలా అన్నింటిలో ఉన్న మొత్తం నీటిని అంచనా వేసి బడ్జె్ట్‌లో చెప్పబోతున్నారు. డిమాండ్‌కి తగినట్లు సప్లై చేసేందుకు ఉన్న మార్గాల్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా పాతవైపోయిన రిజర్వాయర్లు, డ్యాములు, ఇతరత్రా కట్టడాల్ని తిరిగి నిర్మించేందుకు, రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. నీటి ఇంజినీరింగ్ అధికారులు, నీటి పారుదల విభాగం, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. అన్నీ అనుకూలిస్తే..ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేరళ సర్కార్‌ ప్రయత్నిస్తోంది.  కాగా పూర్తిగా కొండ ప్రాంతమైన రాష్ట్రం కావున.. వరదలను నివారించేందుకు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సృష్టించిన ప్రళయం కారణంగా కేరళ అతలాకుతలమయిన విషయం తెలిసిందే. దాని నుంచే దైవభూమి పాఠాలు నేర్చుకున్నట్లుంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డైరెక్ట్‌గా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఘోర ప్రమాదం.. 9 మంది విద్యార్థుల మృతి..!

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

అరుణాచల్‌లో మూడు భూకంపాలు 

బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిసెంబర్‌1 నుంచి అన్నీ ‘ఫాస్టాగ్‌’ లేన్లే

మరో 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!