పోలీస్‌ వైరల్‌ వీడియో: డీజీపీ అభినందనలు

19 Dec, 2019 12:14 IST|Sakshi

పోలీసులు అనగానే ప్రజలకు గుర్తొచ్చేది నమ్మకం, ధైర్యం.. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులపై కాస్తా నెగిటీవిటి పెరిగిపోందన్న విషయంలో వాస్తవం లేకపోలేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రజలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నరన్న మాటలు తరచూ వినిపిస్తోనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులపై ప్రజలకు నమ్మకం పెంచడానికి ఫ్రెండ్లీ పోలీస్‌ సిస్టమ్‌ను అమలు జరుపుతున్నారు. తాజాగా కేరళలో ఓ పోలీస్‌ అధికారి చేసిన పని ఫ్రెండ్లీ పోలీస్‌కు ఉదాహరణగా నిలుస్తోంది. ఇంతకీ ఆయన చేసిన పనేంటో అనుకుంటున్నారా.. కేరళలోని తిరువనంతపురంలో ఎస్‌ఎస్‌ శ్రీజ్తిహ్‌(30) పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ​ఓసారి నగర శివారులో తోటి అధికారులందరూ ఎవరికీ వారు తమ ఆహార ప్యాకెట్‌లను తీసుకొని భోజనం చేస్తున్న సమయంలో  శ్రీజ్తిహ్‌ మాత్రం స్థానికంగా ఉన్న ఓ సాధారణ వ్యక్తితో తన ఆహారాన్ని పంచుకొన్నాడు. ఈ సంఘటను తోటి అధికారి వీడియో తీసి తమ ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు.

ఇక వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్‌ బెహ్రా సదరు పోలీస్‌ అధికారిని అభినందించారు. ఈ విషయంపై శ్రీజ్తిహ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను భోజనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి నన్ను గమనిస్తుండగా.. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించాను. నేను అతన్ని పిలిచి భోజనం చేశావా అని అడిగాను. దానికి అతను లేదు అని చెప్పడంతో నాతో కలిసి తినమని అడిగాను. దానికి ముందుగా నిరాకరించగా నేను బలవంతం చేయడంతో నాతో కలిసి భోజనం చేశాడు’’ అని వివరించారు. ఇక దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయంతో నెటిజన్లు ఫిదా అయి సదరు పోలీసు అధికారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ఇలా చేయడం ద్వారా రియల్‌ హీరో అనిపించుకున్నావ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు