పాలనలో కేరళ టాప్‌

23 Jul, 2018 02:56 IST|Sakshi
కేరళ

మూడో స్థానంలో తెలంగాణ

పీఏసీ వార్షిక నివేదికలో వెల్లడి

బెంగళూరు: దేశంలో అత్యుత్తమ పాలన సాగి స్తున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమం లో 2018 ప్రజా వ్యవహారాల సూచిక (పీఏఐ) ను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్‌ పాల్‌ 1994లో స్థాపించిన ఈ సంస్థ.. దేశంలో మెరుగైన పాలన సాధిం చడం కోసం కృషి చేస్తూ వస్తోంది. ఈ క్రమం లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై అధ్యయనం చేసి గత మూడేళ్లుగా ర్యాంకులు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లో సాం ఘిక, ఆర్థికాభివృద్ధిని గణాంకాల సహితంగా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటా యిస్తోంది. తాజా నివేదిక ప్రకారం మెరుగైన పాలన చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానం సాధించగా.. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్‌ అట్టడుగున నిలిచాయి.

చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ టాప్‌
పీఏసీ నివేదిక ప్రకారం మెరుగైన పాలన సాగి స్తున్న చిన్న రాష్ట్రాల్లో (జనాభా రెండు కోట్ల కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు) హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మిజో రం, సిక్కిం, త్రిపుర వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. నాగా లాండ్, మణిపూర్, మేఘాలయ సూచికలో అట్ట డుగున మిగిలిపోయాయి. పెరుగుతున్న జనాభా ఆధారంగా అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు