జ‌డ్జికి క‌రోనా.. కోర్టు మూసివేత‌

9 Jun, 2020 12:36 IST|Sakshi

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో జిల్లా జ‌డ్జికి క‌రోనా సోక‌డంతో కోర్టును మూసివేశారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు వీడియో కాన్ఫ‌రెన్సుల ద్వారానే కేసులు ప‌రిష్క‌రించాల‌ని జబల్పూర్ హైకోర్టు తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది. వివ‌రాల ప్ర‌కారం.. ఖండ్వా జిల్లా కోర్టు అదనపు జ‌డ్జికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. అంతేకాకుండా ఆయ‌న భార్య‌కు కూడా వైర‌స్ సోకింది. దీంతో మిగ‌తా కుటుంబ‌ సభ్యులు స‌హా న్యాయ‌మూర్తుల కాల‌నీలో నివాసం ఉంటున్న 86 మంది ఇత‌ర న్యాయ‌మూర్తుల కుటుంబాల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.  (సరిహద్దు వివాదం.. కేంద్రం వర్సెస్‌ రాహుల్‌ గాంధీ )

ఖండ్వా జిల్లా ఇన్‌చార్జి జ‌డ్జిగా బుర్హాన్పూర్ సెష‌న్స్ జ‌డ్జిని నియమిస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వీడియో కాన్ప‌రెన్సుల ద్వారానే కేసుల‌ను ప‌రిష్క‌రించాల‌ని పేర్కొంది. క‌రోనా లక్ష‌ణాలు లేవ‌ని నిర్దార‌ణ అయిన 30 శాతం మంది సిబ్బందిని కోర్టుకు హాజ‌ర‌వ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఖండ్వాలో ఇప్ప‌టివ‌ర‌కు 271 మందికి క‌రోనా సోక‌గా వారిలో 17 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారం నాటికి 9,638 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 414 మంది చ‌నిపోయారు. అయితే వైర‌స్ బారినుంచి కోలుకుంటున్న వారి శాతం క్ర‌మంగా పెరుగుతుంద‌ని రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. 24 గంటల్లోనే 205 మంది కోవిడ్ బాదితులు కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్లు తెలిపింది. (కరోనా: కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు )

మరిన్ని వార్తలు