పీఏసీ చైర్మన్‌గా ఖర్గే

3 May, 2017 01:06 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ(పీఏసీ) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే నియమితులయ్యారు. ఏప్రిల్‌ 30న పదవీకాలం ముగిసిన కేవీ థామస్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రతిపక్ష నేత అధ్యక్షత వహించే ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికార ఎన్డీఏ కూటమికి చెందినవారే ఉన్నారు. కొత్త కమిటీలో బీజేపీ ఎంపీలు సుభాష్‌ చంద్ర, రాంశంకర్‌లకు చోటిచ్చి, అదే పార్టీకి చెందిన మరో ఇద్దరిని తొలగించారు. మిగతా సభ్యులు తిరిగి నామినేట్‌ అయ్యారు. ప్రస్తుతం కమిటీలో 21 మంది సభ్యులున్నారు.         

మరిన్ని వార్తలు