హరియాణా: బీజేపీకి గవర్నర్‌ ఆహ్వానం

26 Oct, 2019 17:42 IST|Sakshi

చండీగఢ్‌: హరియాణాలో బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శనివారం రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆమోదం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించారు. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా సమర్పించగా గవర్నర్‌ ఆమోదించారు. రాజ్‌భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ఖట్టర్‌ ఆదివారం గవర్నర్‌ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. ఈరోజు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఖట్టర్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

జన నాయక జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలా(31) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. దుష్యంత్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి ఆయన తండ్రి అజయ్‌ చౌతాలా హాజరుకానున్నారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో దోషిగా తేలిన అజయ్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శనివారం ఆయనకు కోర్టు 14 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. కాగా శుక్రవారం సాయంత్రం బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేయడానికి ముందు దుష్యంత్ తిహార్ జైలులో ఉన్న తన తండ్రిని కలిశారు.

>
మరిన్ని వార్తలు