ఈ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఇక ఎల్ఎల్బీ స్టూడెంట్గా..

15 Jul, 2016 10:20 IST|Sakshi

చండీగఢ్: ప్రముఖ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా న్యాయవాది కావాలన్న తన కలను నెరవేర్చుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఆయన పంజాబ్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి టాప్ మార్కులు తెచ్చుకున్నారు. 166.37 మార్కులు న్యాయ విద్య ప్రవేశ పరీక్షలో సంపాదించారు. దీంతో ఆయన ప్రవేశం ఇక అధికారికంగా ఖరారు కానుంది. మూడేళ్ల న్యాయవిద్య కోసం ఆయన ఈ పరీక్ష రాశారు. 2016-17 విద్యా సంవత్సరం కోసం జూన్ 19న బుధవారం మొత్తం 3,987మంది ఈ పరీక్ష రాయగా వాటి పలితాలను పంజాబ్ యూనివర్సిటీ విడుదల చేసింది.

ఈ ఫలితాల్లో ఖేమ్కా అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.  ఈ సందర్భంగా ఖేమ్కా మాట్లాడుతూ ‘ నాకు న్యాయ విద్య అంటే చాలా ఆసక్తి. నేను సాయంకాలం కోర్సును చేస్తాను. పదవీ విరమణ పొందిన తర్వాత న్యాయవృత్తిని కొనసాగిస్తాను. అందుకే ఈ కోర్సు చేయాలని నేను నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. రాబర్ట్ వాద్రా కేసు విషయంలో అశోక్ ఖేమ్కా కీలక అధికారిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈయనకు చాలా స్ట్రిక్ట్ గా పనిచేసే అధికారిగా పేరుంది. మొత్తం 22 ఏళ్ల సర్వీసులు ఖేమ్కా 46సార్లు బదిలీ అయ్యారు.

>
మరిన్ని వార్తలు