ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదు

14 Jan, 2017 12:25 IST|Sakshi
ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదు

న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు సహచరులు మృతి చెందిన ఘటనకు సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన బల్బీర్‌ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనికోసం సైకియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. బల్బీర్‌ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసు అని అన్నారు. స్నేహితులు సైతం అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గతంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు వివరించినట్లు సమాచారం.

గతంలో బొకారోలో విధులు నిర్వర్తించే సమయంలో సైతం బల్బీర్‌.. ఓ కారు డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. బల్బీర్‌ మానసిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా సీఐఎస్‌ఎఫ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  బల్బీర్‌ జరిపిన కాల్పుల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు బచ్చా శర్మ, అమర్‌నాథ్‌ మిశ్రాతో పాటు.. ఏఎస్‌ఐ జీఎస్‌ రామ్‌, హవల్దార్‌ అరవింద్‌ రామ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు