మనిషిని చంపడమే దేశభక్తా..: కునాల్‌ కపూర్‌

19 Jul, 2017 15:52 IST|Sakshi
మనిషిని చంపడమే దేశభక్తా..: కునాల్‌ కపూర్‌

ఛండీగఢ్: దేశభక్తిపై బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ఒకరిని చంపడం, లేకపోతే సోషల్‌ మీడియాలో ఒకరి మీద మరోకరు విమర్శలు చేసుకోవడమే దేశభక్తా అని ప్రశ్నించారు. దేశభక్తి అంటే ఇండియా-పాక్‌ మ్యాచ్‌ల్లో గంతులేయడం కాదన్నారు. దేశభక్తి అంటే ఒక సిద్ధాంతం అని, దేశ నిర్మాణం దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ సమానమేనని  అందరికీ సమాన హక్కులు ఉంటాయని కపూర్ అన్నారు.

పంజాబ్‌ యూనివర్సిటీలో తను ప్రధాన పాత్రపోషించిన సినిమా 'రాగ్‌దేశ్‌' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రకోటలో భారతీయ ఆర్మీనేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. ఇందులో కునాల్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌ ప్రాత పోషిస్తున్నారు. రాజ్యసభ టీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్ నటులను బాలీవుడ్ లో నటించడానికి అనుమతినివ్వాలన్నారు. కరణ్‌ జోహార్‌ నటించిన ఏ దిల్‌ హై ముస్కిల్‌ చిత్రంలో పాకిస్తాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ ఉన్నాడని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. కానీ తర్వాత రోజుల్లో శ్రీదేవి నటించిన మామ్‌ చిత్రంలో పాకిస్తాన్‌ నటుడు ఉన్నా ఎందుకు అభ్యంతరం తెలపలేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు