'తప్పుగా మాట్లాడలేదు, మనసులో మాట చెప్పా'

20 Jan, 2015 03:32 IST|Sakshi
ఢిల్లీ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ

 న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకుని ఆమెకు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడంపై బహిరంగంగా అసంతప్తిని వెల్లడించిన తూర్పు ఢిల్లీ ఎంపీ మనోజ్ కుమార్ తివారీని పార్టీ మందలించింది. దాంతో ఆయన వివరణ ఇచ్చారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని , తన మనసులోని మాటలను తనదైన శైలిలో వెల్లడించానని  మనోజ్ తివారీ చెప్పారు. కిరణ్‌బేడీని ఠానేదార్ అనలేదని ఆయన చెప్పారు. పార్టీలో చేరినవారు  పార్టీలో ఉన్ను అందరిమాదిరిగా ప్రవర్తించాలే తప్ప వేరుగా కాదని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు.

తన మాటలు ఎవరినైనా బాధించినట్లయితే తాను అందుకు విచారిరస్తున్నానని చెప్పారు. తనకు రామ్ మాధవ్ ఫోన్ చేయలేదని కూడా ఆయన చెప్పారు. కిరణ్ బేడీని  బహిరంగంగా విమర్శించినందుకు  రామ్ మాధవ్ ఫోన్ చేపి మనోజ్ తివారీని మందలించినట్లు వార్తలు వచ్చాయి.  కిరణ్ బేడీ పార్టీ కార్యకర్తేనని , ఆమె అలాగే ప్రవర్తించాలని అంతకు ముందు మనోజ్ తివారీ మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.

నగరానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలను కిరణ్ బేడీ  ఆదివారం తన ఇంటికి టీ పార్టీకి ఆహ్వానించారు. మనోజ్ తివారీ ఆ పార్టీకి హాజరుకాలేదు.   కిరణ్ బేడీ నివాసానికి వెళ్లడం సముచితంగా భావించనందువల్ల తాను పార్టీకి వెళ్లలేదని మనోజ్ తివారీ తెలిపారు.  అది తమ పార్టీ నేత ఆహ్వానం కాదు కనుక తాను వెళల్లేదని  చెప్పారు.  కిరణ్ బేడీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, పార్టీ ఇంకా  సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు