దుకాణ‌దారుల‌ నిర్ల‌క్ష్యం..ఇక‌పై స‌హించం : కిర‌ణ్ బేడి

8 Jul, 2020 14:37 IST|Sakshi

 పుదుచ్చేరి :  క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించే దుకాణాదారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధ‌వారం హెచ్చ‌రించారు.  ఒక దుకాణ‌దారుడు నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్ర‌మాదంలోకి నెట్టివేసిన‌ట్లే అవుతుంద‌న్నారు. అంతేకాకుండా షాపు య‌జ‌మాని కుటుంబంతో స‌హా ఎంతోమంది జోవ‌నోపాదిపై ఈ ప్ర‌భావం ప‌డుతుంద‌న్నారు. కాబట్టి ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల్ని క‌చ్చితంగా పాటించాల‌ని ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా విచార‌ణ జ‌రిపి చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.  ఒక‌రిద్ద‌రు దుకాణాదారుల నిర్ల‌క్ష్యంతో వంద‌ల మందికి క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌ని, దుకాణాదారులంద‌రూ త‌మ ప్రాంగ‌ణాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోల‌న్నారు. ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రిస్తున్నా భౌతిక దూరం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నార‌ని పేర్కొన్నారు. (అంబేడ్క‌ర్ ఇంటిపై దాడి )

మార్కెట్ అసోసియేష‌న్లు, మున్సిపాలిటీ క‌మిష‌న‌ర్లు క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్ని ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని కిర‌ణ్ బేడీ కోరారు. ఎప్ప‌టికప్పుడు శానిటైజేష‌న్ నిర్వ‌హిస్తూ పరిస‌ర ప్రాంతాల‌ను శుభ్రంగా ఉంచాల‌న్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా రోజుకి 70 కిపైగా కేసులు న‌మోద‌వుతున్నందున ప్ర‌తీ ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇందులో ప్ర‌జ‌ల స‌హ‌కారం ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో పుదుచ్చేరిలో 112 కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. (‘ఆర్థిక సంక్షోభం తీవ్రతరం’ )


 

మరిన్ని వార్తలు