వార్తా సంస్థ‌పై కేంద్ర‌మంత్రి ఫైర్‌.. ఏమైందంటే..

21 Apr, 2020 14:55 IST|Sakshi
కిరణ్‌ రిజిజు

ఢిల్లీ : ఇటీవ‌లి అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో తిన‌డానికి అన్నంలేక పామును చంపి తిన్నార‌న్న వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఓ ప్ర‌ముఖ వార్తాసంస్థ ప్ర‌చురించిన ఈ వార్త‌లో నిజం లేద‌ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశంలోనే పేరున్న వార్తాసంస్థ అయి ఉండి త‌ప్పుడు వార్తను ఎలా ప్ర‌చారం చేశారంటూ మండిప‌డ్డారు. దేశంలో అన్నం లేక‌పోతే పాముల‌ను తిన‌డం ఎక్క‌డైనా జ‌రిగిందా అంటూ ప్ర‌శ్నించారు. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ అరుదైన పాముల‌కి నిల‌యం అని, అక్క‌డ ఎవ‌రూ పాముల‌ని చంపి తిన‌రని స్ప‌ష్టం చేశారు. స‌ద‌రు వార్తాసంస్థ క‌థ‌నాన్ని జోడిస్తూ వాస్త‌వాలు ధ్రువీక‌రించ‌కుండా ఏది ప‌డితే అది రాస్తే ఎలా అంటూ  ట్విటర్‌లో వేదిక‌గా ఫైర్ అయ్యారు. 

ఇక అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వార్తను తప్పుపట్టింది. తమ రాష్ట్రంలో వచ్చే 3 నెలలకు సరిపడా బియ్యం ఉందనీ, పేదలందరికీ తాము ఉచిత రేషన్‌ కింద బియ్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం 20వేల మంది ఈ ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఇక లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు 492 మందిని అరెస్టు చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన 750 వాహ‌నాదారుల‌పై కేసు న‌మోదుచేసి వాహ‌నాలు సీజ్ చేసిన‌ట్లు డీజీపీ ఆర్‌పి ఉపాధ్యాయ తెలిపారు.

>
మరిన్ని వార్తలు